రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి రాష్ట్రంలో ఉద్యమాలు జరగట్లేదని,పార్టీ కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టారని హైకమాండ్ కు వరసగా కంప్లైంట్ లు వెళ్తున్నాయి.తాజాగా దీనిపై స్పందించిన హైకమాండ్ వెంటనే రేవంత్ ను ఢిల్లీకి పిలిపించి రాష్ట్రంలో పార్టీలో ఏం జరుగుతుందో ఆరా తీశారు.
అలాగే ఫేస్‌బుక్‌లో రేవంత్ ప్రజాదర్బార్ పేరుతో నియోజకవర్గాల వారీగా ఉన్న అకౌంట్స్ లో కాంగ్రెస్ సీనియర్స్ ప్రతిష్ట దెబ్బ తినేలా పెడుతున్న పోస్టింగ్స్ పై హైకమాండ్ వివరణ కోరింది.ఈ ప్రజాదర్బార్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని హైకమాండ్ వద్ద స్పష్టం చేసిన రేవంత్.ఈ కంప్లైంట్ ఇచ్చిన మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డిని ఢిల్లీ నుండి వచ్చాక ఆయన నివాసంలో కలిశారు.తనకు ఈ ప్రజాదర్బార్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.