BIGG BOSS: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే..! ఏమాత్రం తగ్గకుండా ఎవరినీ లెక్కచేయకుండా బిగ్ బాస్ హౌస్ లో వ్యక్తిగత గేమ్ ఆడుతూ ముందుగు సాగుతున్నాడు. ఈ క్రమంలో రేవంత్ కాస్త ఎక్కువగానే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది.
హౌస్ లో తన వ్యవహార శైలి కారణంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నాలుగు వారాల పాటు జరిగిన నామినేషన్స్ అన్నింటిలో రేవంత్ ఉన్నాడు. అంటే ఓసారి మీరే ఆలోచించండి. ఎంతలా బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ తీరు తోటి కంటెస్టెంట్స్ కి ఇబ్బంది కలిగించి ఉంటుంది. దీనికి తోడు రేవంత్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లోనూ గెలవాలనే ప్లాన్స్ వేస్తుంటాడు. గెలవాలనుకోవడం మంచిదే. కానీ తాను మాత్రమే ఎలాగైనా గెలవాలి అనే కాస్తంత స్వార్థపు ఆలోచన అనేది తోటి హౌస్ మెంట్స్ కి అర్థం అయిపోయింది.

వినోదం పంచడం ఏమోగాని హౌస్ లో ఒకరిద్దరితో తప్పా అందరితో గొడవలే. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. తనకు ఉన్న ఫాలోయింగ్ హౌస్ లో దాదాపు ఎవరికీ లేదు. కానీ రేవంత్ తీరు ఎలా ఉందంటే… ఓ సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఆదిరెడ్డి, రోహిత్ ఫన్నీగా నవ్వుతారు. దాన్ని కూడా సీరియస్ గా తీసుకుని.. నవ్వండి నవ్వండి చివరకు బిగ్ బాస్ కప్పు నా చేతిలోకి వచ్చాక అప్పుడు చెప్తా అంటూ ఏకంగా టైటిల్ తానే విన్నర్ అవుతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అని చెప్పడంలో తప్పేమీ లేదని కొందరు అంటున్నారు.
దీనికి తోడు ప్రస్తుతం హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడి టాస్క్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేవంత్ ను తొలగిపోతాడు. గత వారంలో కూడా ఇలానే తాను కెప్టెన్సీగా ఎలాగైనా గెలవాలని వ్యక్తిగత ఆట ఆడటం కారణంగా కెప్టెన్సీ టాస్క్ లో గెలవలేకపోయాడు. ఎంత ఫాలోయింగ్ ఉన్నా హౌస్ లో అందరినీ కలుపుకుని ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతూ ముందుగు సాగితేనే రేవంత్ అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇలానే కొనసాగితే ఏదో ఒక వారంలో నామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం రేవంత్ ఇంకా మున్ముందు ఏమైనా మారతాడా లేదా అనేది.!