Biggboss 6 : సాధారణ జీవితానికి భిన్నంగా ఒక ఇంట్లోకి వెళ్లి కొన్ని నెలల పాటు ఆ ఇంట్లోనే జీవించాలి. కనీసం మాట్లాడుకోవడానికి ఫోన్ ఉండదు.. రాసుకోవడానికి పేపర్ ఉండదు.. గోడు చెప్పుకోవడానికి ఆత్మీయులు ఉండరు. ఎవరు చూసినా ఒక వ్యక్తిని అనుమానంగానే చూస్తారు. ప్రతి చర్య గేమ్‌లో భాగంగానే అన్నట్టుగా తీసుకుంటారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఇమడటమే అతి పెద్ద టాస్క్. కాస్త అలవాటు పడితే ఏమో కానీ తొలి రోజులంతా కన్ఫ్యూజన్‌లోనే గడిచిపోతాయి. కొందరి పరిస్థితి మాత్రం వేరనుకోండి. ఎక్కడ ఉన్నా ఇది తమ ఇల్లే అన్నట్టుగా ఫీలవుతుంటారు. ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నానన్న విషయాన్నే మరిచిపోతారు.
బిగ్‌బాస్ షో లోకి 21 మంది కొత్త కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. వారు వెంటనే అందరితో కలిసిపోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. సాధారణంగా బిగ్‌బాస్ షోలో ఎంటరైన కంటెస్టెంట్లకు ఆ హౌస్ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. తొలిరోజు ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో మొదటి రోజు ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తాన, గలాటా గీతూ, సింగర్ రేవంత్ హైలైట్ అయ్యారు. కారణం గీతూ, ఇనయ గొడవపడ్డారు. అటు రేవంత్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక రకంగా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతోంది.
Biggboss 6 : రేవంత్ ప్రవర్తనకు షాక్ అవుతున్న నెటిజన్లు
ఒకానొక సమయంలో రేవంత్ ఓ బూతు మాట్లాడి ఆ వెంటనే నాలుక్కరుచుకుని సారీ చెప్పాడు. తాను వండింది నచ్చితే తినండి లేదంటే లేదంటూ చిరాకు ప్రదర్శించాడు. మొత్తానికి తనకు అసలు బిగ్‌బాస్ షో గురించి అవగాహన లేదన్నట్టుగా ప్రవర్తించాడు. తోటి కంటెస్టెంట్లు ఎవరూ తెలీదంటూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. దీంతో రేవంత్ ప్రవర్తనకు నెటిజన్లు షాక్ అవుతున్నాడు. ఏంటి ఇతను ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడు కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నాడని, బిగ్‌బాస్ ఇంట్లో సర్దుకోవడానికి కొంత టైం పడుతుందని ఆయన అభిమానులు వెనకేసుకొస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్‌లన్నింటికీ ఫుల్ స్టాప్ పెడితేనే రేవంత్ ముందుకు సాగగలడు. లేదంటే కష్టమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.