Biggboss 6 : బిగ్‌బాస్ హౌస్ అంటే గొడవలకు అడ్డా. అసలు గొడవలు జరిగితేనే షోకి కావల్సినంత రేటింగ్. అందుకే గొడవలను క్యాప్చర్ చేసినంతగా మరే విషయాన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు హైలైట్ చేయరు. షో ప్రారంభమై వారం కూడా గడవక ముందే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇప్పటి వరకూ బాగా హైలైట్ అయిన వాళ్లలో సింగర్ రేవంత్ ఉన్నాడు. ఆ తర్వాత గలాటా గీతూ, ఆరోహి, బాలాదిత్య తదితరులు ఉన్నారు. ఇక నిన్న సీన్‌లోకి యూ ట్యూబర్ ఆదిరెడ్డి కూడా వచ్చాడు. ఏదో రేవంత్‌ను రెచ్చగొట్టి హైలైట్ అయ్యేందుకు యత్నించినట్టుగా అనిపించింది. బాలాదిత్య హౌస్‌లో పెదరాయుడి పాత్ర పోషిస్తున్నాడు.
టాస్క్ విషయంలో నిన్న ఆరోహికి, రేవంత్‌కు కాసింత గట్టిగానే పడింది. ఆరోహి వేలు చూపిస్తూ ఫైర్ అవడంతో రేవంత్ బాగా హర్ట్ అయ్యాడు. దీంతో కెమెరా ముందుకెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘నా వల్ల ప్రాబ్లమ్ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్‌గా ఆడుతున్నారు. నేను సింగిల్‌గా ఆడతా, ఎన్నిరోజులైనా ఆడతా. ఇంత సిన్సియర్ పీపుల్ మధ్య నేను అర్హుడిని కాదేమో, ఈ నిమిషమే నన్ను పంపించేయండి. ఇలా యాక్ట్ చేస్తూ బతకడం రాదు’ అని చెప్పాడు. కానీ రాత్రయ్యేసరికి ఆరోహి రేవంత్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. అయినా కూడా గొడవ సద్దుమణిగినట్లు కనిపించలేదు.
Biggboss 6 : రేవంత్ మైండ్ కూల్ చేసిన బాలాదిత్య
ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉన్న రేవంత్ తన మనసులో ఉన్న ఆవేశాన్ని అణచుకోలేక తానేంటో చూపిస్తానంటూ ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇక అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆదిరెడ్డి ఆ పాయింట్‌ను పట్టుకుని రేవంత్‌ను రెచ్చగొట్టేందుకు యత్నించాడు. కొంత మేర సక్సెస్ కూడా అయ్యాడు. ఫ్రస్టేషన్‌లో రేవంత్ తానేమీ సోషల్ మీడియా నుంచి రాలేదని నోరు జారాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆదిరెడ్డి అంటే సోషల్ మీడియా నుంచి వచ్చినవాళ్లు చులకనగా కనిపిస్తున్నారా? అని రేవంత్‌ను ఇరికించేందుకు యత్నించాడు. అలా వీరి గొడవ ముదిరేలా ఉందని గ్రహించిన శ్రీహాన్ రేవంత్‌ను హౌస్‌లోకి తీసుకెళ్లాడు. ఇక ఈరోజంతా గొడవలు పడి మైండ్ హీటెక్కిన రేవంత్‌ను బాలాదిత్య వచ్చి పక్కన కూర్చొని మైండ్ కూల్ చేశాడు.