Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రస్టింగ్‌గా తయారవుతోంది. ఈ వారానికి సంబంధించి నేడు కెప్టెన్సీ టాస్క్ పూర్తైంది. అలాగే రేవంత్ కెప్టెన్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ జరుగుతుండగానే గలాటా గీతూ టంగ్ స్లిప్ అయ్యి మన రేలంగి మామయ్య అదేనండి బాలాదిత్యకు బీభత్సమైన కోపం తెప్పించేసింది. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో బాలాదిత్యకు రేలంగి మామయ్య, మిస్టర్ కూల్ అనే పేర్లున్నాయి. ఎందుకంటే అంత కూల్‌గా.. అందర్నీ కలుపుకుని పోతూ.. నొప్పించక తానొవ్వక అన్న సూత్రాన్ని అక్షరాలా ఫాలో అయిపోతుంటాడు బాలాదిత్య.
అందుకే రిలేషన్సే పెట్టుకోను అన్న గీతూకి కూడా బాలాదిత్య తన కుటుంబ సభ్యుడిలా.. అలాగే సొంత సోదరుడిగా భావిస్తూ ఉంటుంది. మొన్న జరిగిన టాస్క్‌లో బాలాదిత్య తనకు మనీ ఇవ్వలేదని తెగ ఫీలైపోయింది. బిగ్‌బాస్ పిలిచి గాసిప్ చెప్పమంటే కూడా బాలాదిత్య అన్న దీపు, దీపు అంటుంటే తనకు మండుతోందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆమె బాలాదిత్యను అంతలా అభిమానిస్తోంది. అయితే తాజాగా గీతూ బాలాదిత్యకు విపరీతంగా కోపం తెప్పించింది. కూల్‌గా ఉండే రేలంగి మామయ్య కాస్తా.. ఇవాళ కొద్దిసేపు రావుగోపాలరావు అయిపోయి శివాలెత్తిపోయాడు.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో గీతు-బాలాదిత్యల పెద్ద గొడవ జరిగింది. గీతూ ఏమన్నది అనేది ప్రోమోలో చూపించలేదు కానీ.. బాలాదిత్య బీభత్సంగా ఫైర్ అయిపోతూ.. తన చదువుని తక్కువ చేసి మాట్లాడొద్దని ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ గీతూ చెప్పాడు. గీతూ తానలా తక్కవ చేయలేదని చెబుతున్నా.. కూడా తప్పని గట్టిగా అరుస్తూ.. నీకు అర్ధం కాకపోతే హేళన చేస్తావా? అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు. నిన్ను తక్కువ చేయలేదని గీతు అరిచి చెప్పడంతో.. గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు ఆపమని చెప్పాడు. ‘వింటున్నా.. వింటున్నా.. ఆట పట్టించడానికైనా లిమిట్ ఉంటుంది.. అది దాటితే ఇలాగే ఉంటుంది’ అని బాలాదిత్య సీరియస్ అయ్యాడు. దీంతో కంటెస్టెంట్స్ మొత్తం షాక్ అయ్యారు.