దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేసిన ‘రిపబ్లిక్’ మూవీకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.ఈ సినిమాలో దర్శకుడు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసిన సీన్స్,డైలాగ్స్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫైనాన్షియల్ గా సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఏడు కోట్లను రాబట్టాల్సివుంది.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని సినిమాలను డామినేట్ చేస్తున్న ఈ మూవీకి ఈ మార్క్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.