పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా తెలుగు ప్రేక్షకులు అందరికి సుపరిచితం అయిన రేణు దేశాయ్. హీరోయిన్ గా భద్రి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమ కారణంగా సినిమాలకి దూరం అయ్యింది. మళ్ళీ అతనికి జోడీగానే జానీ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత పూర్తిగా సినిమాలకి స్వస్తి చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పూణే వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిన రేణు దేశాయ్ అకిరా, ఆధ్యా పెద్దవాళ్ళు అయ్యాక మరల ఎంటర్టైనర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు రియాలిటీషోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.
ఇక దర్శకురాలిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చాలా ఏళ్ళ తర్వాత మరల రేణు దేశాయ్ వెండితెర మీద సందడి చేయబోతుంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆమెని ఎంపిక చేశారు. ఇక ఆమె కూడా పాత్ర నచ్చడంతో నటించడానికి వెంటనే ఒకే చెప్పేసింది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. పీరియాడిక్ జోనర్ లో ఓ గజదొంగ బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ తాను పోషించే పాత్ర గురించి ఇన్స్టాగ్రామ్ లో రివీల్ చేసింది. హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది. పైగా రేణు తన సన్నివేశాల స్క్రిప్ట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇక ఆమె ఒక సోషల్ యాక్టివిస్ట్ గా సినిమాలోకనిపించబోతుందని రేణు దేశాయ్ చెబుతున్న దాని బట్టి తెలుస్తుంది. మరి ఆ పాత్ర రేణు దేశాయ్ కెరియర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.