Relationship: జీవితంలో జీవిత భాగస్వామి ప్రేమ లభించకపోతే లైఫ్ నరకంగా ఉంటుంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలకలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరు దంపతుల మధ్య ప్రేమ మాత్రం ఉండదు. దీంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయి విడాకులకు దారితీస్తాయి. పిల్లలు, బాధ్యతలు, అవసరాలు పెరిగే కొద్దీ భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. అయితే దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న చిలిపి పనులు భార్యభర్తల మధ్య ప్రేమను మరింత పెంచుతాయి. మీ భాగస్వామికి అప్పుడప్పుడూ ఐలవ్యూ అని మేసేజ్ చేయండి. బర్త్ డే, పెళ్లిరోజు వంటి వేడుకలకే కాకుండా వీలు చిక్కినప్పుడు మీ భాగస్వామి ఇష్టపడే వస్తువులు కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. ఉదయాన్నే లేవగానే ఇద్దరూ కలిసి టీ లేదా కాఫీ తాగుతూ ఒకరికొకరు మనసులోని భావాలను పంచుకోండి. ఇలా చేస్తే ప్రేమ పెరిగి ఇద్దరి మధ్య బంధం మరింత దృఢపడుతుంది.
నిత్యం ఉద్యోగాలు, బాధ్యతలు అంటూ బిజీగా గడపకుండా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని వెచ్చించండి. సరదాగా బయటకు వెళ్లడం లేదా సినిమాకు వెళ్లడం చేయడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. సినిమాలు వీలు కాకపోతే ఇంట్లోనే కామెడీ లేదా రొమాంటిక్ వెబ్ సిరీస్‌లను వీక్షించండి. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు తగ్గుతున్నాయనే భావన కలిగినప్పుడు మీ జీవిత భాగస్వామి పనుల్లో భాగం కండి. తలకు నూనె పట్టించడం, తలస్నానం చేయించడం లాంటి పనులు ఇద్దరి మధ్య సఖ్యతను మరింత పెంచుతాయి.
Relationship:
జీవిత భాగస్వాములిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి. అనుబంధం బాగుండాలంటే.. ప్రతి చిన్న విషయం ప్రేమగా చర్చించాలి. కావాల్సిన సలహాలు, సూచనలు చెబుతూ ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ శాశ్వతం అవుతుంది. మీ ఇద్దరి మధ్య సమస్యలు పెద్దవిగా మారితే ప్రేమ తగ్గిపోతుంది. అందుకే సమస్య పెద్దది కాకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం.