Relationship Tips: భార్యభర్తల మధ్య సంబంధాలు బలంగా ఉంటేనే పిల్లలు, వారి మధ్య అన్యోన్యత పటిష్టంగా ఉంటుంది. తద్వారా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. అందుకే దంపతులు ప్రేమతో, అవగాహనతో నడుచుకోవాలి. ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలతో పాటు భార్యభర్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నాలుగు ముఖ్యమైన విషయాలను చెప్పాడు.
ఒకరిపై ఒకరికి ప్రేమ
లోకంలో దేన్ని అయినా జయించేది ప్రేమే. అందుకే భార్యభర్తల మధ్య ప్రేమ ఉంటేనే బంంధాలు బలపడతాయి. ఒకరిపై ఒకరికున్న ప్రేమను తాము చేసే పనుల ద్వారా సందర్భాన్ని బట్టి వ్యక్తపరచండి. ఆప్యాయతతో పలకరించుకుంటూ.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.
బాధ్యత..
కుటుంబంలో ఒకరిపై ఒకరికి బాధ్యత ఉండాలి. సుఖాల్లోనే కాదు కష్టాల్లోనే అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలి. అంకితభావంతో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఎప్పుడూ ముందుండాలి. అప్పుడే భార్యభర్తల సంబంధం కలకాలం నిలిచి ఉంటుంది.
గౌరవం..
కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తగినంత గౌరవం ఇస్తేనే ప్రేమ పెరుగుతుంది. చిరాకులు, కోపాలు వచ్చినప్పుడు కూడా తమ అభిప్రాయన్ని గౌరవప్రదంగా చెప్పాలి. లేకపోతే పెద్ద గొడవలకు దారి తీస్తుంది. భార్యభర్తల మధ్య చిచ్చుకు కారణమవుతుంది.
Relationship Tips: స్వార్థం ఉండకూడదు..
భార్యభర్తల మధ్య ప్రేమ, బాధ్యత, గౌరవం ఎలా ఉండాలో.. స్వార్థం అస్సలు ఉండకూడదు. నా, నాది, నీది అనే భావన లేకుండా మనం, మనది అనే దృక్పథం ఉండాలి. అంకితభావంతో ఉంటూ అన్ని విషయాలను పంచుకోవాలి.
ఈ నాలుగు ప్రాథమిక సూత్రాలను పాటించినప్పుడు భార్యభర్తల మధ్య బంధానికి తిరుగుండదు.