Relationship Tips: తమకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో దించాలనే ఉద్దేశంతో చాలామంది అబ్బాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా రకరకాలుగా తయారవుతుంటారు. రకరకాల ఫీట్లు చేస్తుంటారు. మరికొందరు అయితే జిమ్ కి వెళ్లి బాగా కండలు పెంచితే అమ్మాయిలు ఇష్టపడతారని జిమ్ లో తెగ కష్టపడుతుంటారు.
అమ్మాయిలు నిజంగా అబ్బాయిలను కండలు చూసి ఇష్టపడతారా? జిమ్ లో కష్టపడి కండలు పెంచితే అమ్మాయిలు ఇష్టపడతారా? అనే ప్రశ్నలు మామూలుగా వస్తూ ఉంటాయి. మరి దీనికి సమాధానం ఏంటి? దీనికి సంబంధించి ఏదైనా పరిశోధన ఉందా అనే అన్ని ప్రశ్నలకు ఈ ఆర్టికల్ లో మీకు సమాధానాలు లభిస్తాయి.
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనే విషయం మీద సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలకు కండలు తిరిగిన, ఎక్సర్ సైజ్ బాడీ కలిగి రెచ్చిపోయి సెక్స్ చేసే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదట. సాఫ్ట్ గా, కూల్ గా, అందంగా ఉండి అమ్మాయిలను అర్థం చేసుకునే వారంటే ఇష్టం అట.
Relationship Tips:
అందరితో సరదాగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారని ఆ సర్వేలో తేలింది. తమ మీద ఆధిపత్యం చలాయించే మగవాళ్లను ఆడవారు అస్సలు ఇష్టపడరట. సున్నితమైన మనసు కలిగిన, ఆడవారి ఆశలు, ఆశయాలను అర్థం చేసుకునే వారు అంటే అమ్మాయిలకు విపరీతమైన ఇష్టం అట.