Relationship: ప్రతి మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇది మనుషుల జీవితాలను పరిపూర్ణం గా మారుస్తుంది. పెళ్లి ద్వారా ఇరు కుటుంబాల మధ్య సంబంధం పెరుగుతుంది.1980 లలో పెళ్లైన జంటలు విడాకుల కోసం ఒకటి లేదా రెండు జంటలు మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం అవి వేల సంఖ్యలో వస్తున్నాయి. ఇగోతో చిన్న కారణాలకు విడాకులు అడుగుతున్నారు. విచిత్రంగా చాలా సంవత్సారాలు గా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రోజులకే విడాకులు కోరుతున్నారు. వీటికి ఇద్దరి మధ్య అనుబంధం లేకపోవడమే కాక కుటుంబ సభ్యులు కూడా కారణం అవుతున్నారు.
అయితే లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది పెళ్ళి బంధాలను బలపరుస్తున్నాయని చెబుతున్నారు. పెళ్ళికి ముందు ఇద్దరి అభిప్రాయాలు స్పష్టంగా తెలుస్తాయి. కాని భారతీయ సమాజంలో పెళ్లికి ముందు ఇలా కలసి వుండటం ఒప్పుకోరు. కాని అప్పటి వరకు ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో పడక గదిలో వుండడం ఎలా వుంటుంది. ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ల వల్ల జంటలకు తప్పు ఒప్పులు తెలుస్తాయి. ముందు ముందు జీవితం ఎలా ఉంటుందో ముందే తెలుస్తుంది. దాని వల్ల పెళ్లి తర్వాత సాపీగా జీవితం జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత పిల్లలు కూడా మన జీవితంలోకి వస్తారు.
వివాహానికి ముందు కలిసి వుండటం వలన పార్టనర్ అలవాట్లు మరియు ప్రవర్తన గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ టైమ్ మీ వివాహం తర్వాత మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది పెళ్లికి ముందు ఒక ప్రీ ఫైనల్ టెస్ట్ లాగా వుంటుంది. ఇద్దరి మధ్య అడ్జస్ట్ మెంట్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య డబ్బు లావాదేవీల పై చర్చ జరుగుతుంది. ఖర్చులు ఎలా తగ్గుతాయా అని ప్లాన్స్ వేస్తారు. ఇద్దరి ఓకే చోట వుండడం తో ఇంటి అద్దె, ఇతర ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు. లేదా దానిని తమ కలలు సాధించేందుకు వాడుకుంటారు.
Relationship:
లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వల్ల భవిష్యత్ లో భార్య భర్త లు గా మారడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరి అభిప్రాయాలు కలవక పోతే విడాకుల తీసుకోవలసిన అవసరం లేదు. దీనివల్ల ఇరు కుటుంబాల కు నష్టం వుండదు , వృదా పెళ్లి ఖర్చు వుండదు. పిల్లలు పుట్టి వారి జీవితం అంధకారం లోకి వెళ్లకుండా వుంటుంది