Relationship: పెళ్లి చేసుకోబోయే జంటలకు అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. ముఖ్యంగా పాత తరం వారైతే పెళ్లి విషయంలో ఓ సామెత బాగా చెబుతుంటారు. ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూడాలంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ప్రేమ వివాహమైనా అన్నీ కుదిరాకే ఓ క్లారిటీకి రావాలి. అయితే, పెళ్లి చేసుకోబోయే వారికి కొన్ని విషయాల్లో ముందే క్లారిటీ ఉండాలట. అలా ఉంటే దాంపత్య జీవితంలో ఎలాంటి అరమరికలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు రిలేషన్ షిప్ నిపుణులు.
పెళ్లయ్యాక డబ్బు విషయంలో చాలా జంటల మధ్య తగాదాలు వస్తుంటాయి. ప్రస్తుత సమాజంలో డబ్బుకున్న విలువ దేనికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. బంధాలు బలపడాలన్నా, బలహీన పడాలన్నీ డబ్బు కీ రోల్ పోషిస్తుంది. అందుకే డబ్బు విషయంలో మీ కాబోయే భాగస్వామితో చర్చించాలి. ఒకరు పొదుపు చేస్తే మరొకరు దుబారా ఖర్చు చేస్తుంటే ఆ జంటల మధ్య అన్యోన్యత దెబ్బ తింటుంది. అందుకే కాబోయే భాగస్వామి డబ్బు విషయంలో ఎలాంటి స్టాండ్ తో ఉంటారో ముందే తెలుసుకోవాలి. ఇద్దరూ ఒకే తాటిపైకి వస్తే బెటర్.
అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా కనుక్కోవాలి. పెళ్లికి ముందు చాలా మంది మరొకరిని ప్రేమిస్తుంటారు. తర్వాత బ్రేక్ అప్ అవుతుంటుంది. విధి లేని పరిస్థితుల్లో మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యాలు ముందే తెలుసుకొని అర్థం చేసుకోగలిగితేనే భవిష్యత్తులో ఏ గొడవలూ రాకుండా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది.
Relationship: ఉద్యోగం విషయంలో క్లారిటీ అవసరం..
భార్యా భర్తలు ఇద్దరూ నేటి రోజుల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. అలా అయితేనే సంసారాలు నెట్టుకురాగలుగుతారు. కానీ కొంత మందికి భార్య ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఇలాంటి విషయాలు పెళ్లి చూపులప్పుడే తెలుసుకుంటే బెటర్. దీంతోపాటు ప్రైవసీ, వ్యక్తిగత అలవాట్లు, ఉమ్మడి కుటుంబంలో ఉండాలా, విడిగా ఉండాలా అనే విషయాల్లో క్లారిటీ తీసుకుంటే భవిష్యత్తులో ఏ గొడవలూ రాకుండా ఉంటాయి.