Relationship: ప్రతి ఒక్కరు తమ లైఫ్ పార్ట్ నర్ తో ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు లైఫ్ పార్ట్ నర్ల విషయంలో చేసే తప్పులు జీవితంలో ఇబ్బందులను తెస్తుంటాయి. మనకు బాగా కావాల్సిన వాళ్లతో కూడా లైఫ్ పార్ట్ నర్ గురించి కొన్ని విషయాలను అస్సలు పంచుకోకూడదు. ఇలా చేస్తే మీ జీవితం ఇబ్బందుల్లో పడ్డట్లే అని గుర్తించుకోండి.
కుటుంబ విషయాలు:
మీ కుటుంబంలో ఏం జరిగినా, మీ లైఫ్ పార్ట్ నర్ ఏదైనా తెలిసీ తెలియక తప్పు చేసినా దాని గురించి ఎవరితోనూ నోరు జారవద్దు. నోరు జారి వారి గురించి తప్పుగా మాట్లాడకండి. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవనే విషయం గుర్తించుకోండి.
ఎమోషన్స్ గురించి పంచుకోకండి:
మీ లైఫ్ పార్ట్ నర్ మీకు ఎలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో, లేదంటే ఎలా కనెక్ట్ అవలేదో అని ఎవరోతూ షేర్ చేసుకోకండి. దీని వల్ల మీరు ఎవరికైతే చెబుతారో వారికి మీ లైఫ్ పార్ట్ నర్ గురించి చులకన భావం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో మీకే ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా సందర్భంలో మీ లైఫ్ పార్ట్ నర్ గురించి ఈ విషయాన్ని వారు మీకే చెప్పి మీకు ఇబ్బంది కలిగిస్తారని గుర్తించుకోండి.
Relationship : సెక్స్ విషయాలు:
మీ లైఫ్ పార్ట్ నర్ తో మీరు చేసే శృంగారం గురించి కూడా మీకు ఎంతో దగ్గరి వారైనా వారితో పంచుకోకండి. మీ సెక్స్ విషయాలు బహిరంగ పరచడం వల్ల మీ మీద, మీ లైఫ్ పార్ట్ నర్ మీద ఒక రకమైన చులకన భావం ఏర్పడుతుందని గుర్తించుకోండి.