Relationship: సెక్స్ అనేది ఒక మధురమైన అనుభూతి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో శృంగార కలయిన అనేది చాలా ముఖ్యమైనది. ఇది భార్యభర్తల బంధాన్ని బలపరుస్తుంది. ఒకరిపై ఒకరికి ప్రేమను తెలియజేడంతో శృంగారం ఎంతో కీలకమైది. సంతానోత్పత్తికే కాదు సెక్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు ఎప్పుడో తేల్చి చెప్పేశారు. శృంగారం ద్వారా భావప్రాప్తి పొందుతారు.
సెక్స్ భార్య, భర్తల హార్మోన్స్ లు ఉత్తేజం చెంది మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తుందని పలువురు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే శృంగారం చేస్తే ఆరోజు మొత్తం ఎంతో ఉత్సాహవంతంగా గడుపుతారని కూడా చెబుతూ ఉంటారు. ఓ సర్వే ప్రకారం.. సగటున 5 నుండి 6 నిమిషాల వరకు శృంగారం చేస్తున్నట్లు తేలింది. సెక్స్ ఇంత సమయమే చేయాలని ఏమీ లేదు. ఎంత వరకు భార్యాభర్తలు ఎంజాయ్ చేయాలనుకుంటారో అంతవరకు చేయవచ్చు.

దాంపత్య జీవితంలో 40 ఏళ్లు వచ్చాక క్రమంగా సెక్స్ పట్ల కోరిక తగ్గుతూ వస్తుంది. ఇందుకు నిపుణులు అనేక కారణాలు చెబుతున్నారు. మానసిక స్థితి, ఒత్తిడి స్థాయి, ఆరోగ్యం సహకరించకపోవడం, దీర్ఘకాలిక హార్మోన్ల మార్పుల కారణంగా సెక్స్ పట్ల క్రమంగా ఇష్టం తగ్గుతూ వస్తుంది. భాగస్వామి పట్ల ప్రేమ ఉన్నా కూడా అది శృంగార దశ వరకు వెళ్లదు. ఇలా వయసు పెరిగే కొద్దీ శృంగారం మీద కోరికలు సన్నగిల్లుతూ ఉంటాయి.
అలా జరగకుండా ఉండాలంటే ముందు శృంగారం అనేది ఒక కలయిక మాత్రమే అనే భావన దంపతులు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలతో శారీరక సాన్నిహిత్యం ఎంతో కీలకం. కానీ సెక్స్ కలయిక మాత్రమే ఎప్పుడూ సంతోషకరమైన మార్గం కాదని నిపుణుల వాదన. ఎందుకంటే సెక్స్ ద్వారా ప్రతి 10 మందిలో నలుగు మాత్రమే ఎప్పుడూ భావప్రాప్తి పొందుతారట. 40 ఏళ్ల వయసులో కూడా శృంగారం ద్వారా కావాల్సినంత భావప్రాప్తి పొందాలంటే కంటి నిండా నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దంపతుల దినచర్యలో ఎంతో అవసరం. దీనికి తోడు డాకర్ల సలహాలు, సూచనలు కూడా మీ 40 ఏళ్ల దాంపత్య శృంగార జీవితం సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది.