Relation: ఈ మధ్య భార్యభర్తలు ఇద్దరు పని చేయనిదే ఇల్లు గడవట్లేదు. ఈ బిజీ జీవితంలో ఎవరి పనులు వారికి ఉంటున్నాయి. పొద్దునెపుడో ఆఫీస్ నుంచి బయలుదేరడం, రాత్రి ఎపుడో అలసిపోయి ఇంటికి రావడం ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతుంది. ఇక ఇద్దరు కలిసి సమయం గడపడానికి తీరిక లేకుండా పోతుంది. దీని వల్ల వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా దూరంగా ఉంటున్న ఫీలింగ్ తో ఉంటున్నారు. ఇక వారిద్దరికీ కాస్త ఖాళీ సమయం దొరికేది కేవలం వీకెండ్స్ లేదా సెలవు రోజుల్లో మాత్రమే. ఈ సమయాన్ని అయినా సరిగ్గా వినియోగించుకోవాలి. అయితే ఎప్పుడు బయటికి వెళ్లడం వల్ల కూడా మళ్లీయే అలసిపోతూ ఉంటారు. కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఇవి పాటిస్తే మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది.
అయితే ఇంట్లో ఉన్నప్పుడు బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఏదో ఒక ఫుడ్ ఐటెం ని ఇద్దరు కలిసి చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇద్దరు కొంత సమయం గడిపినట్టుగా ఉంటుంది. అలాగే ఇద్దరు కలిసి ఇలా పనులు చేసుకోవడం వల్ల ఇద్దరిలో మంచి అభిప్రాయం ఏర్పడి ఆనందంగా ఉంటారు.
ఇద్దరు కలిసి ఏదో ఒక గేమ్ ని ప్లాను చేసుకోండి. వారమంతా పని చేసి అలిసిపోవడం కామనే కానీ ఇంట్లో వారితో సమయం గడపడం అంత కంటే ముఖ్యం. చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేసుకుని ఇంట్లో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీలో మనస్పర్థలు కూడా తొలగిపోతాయి.
Relation:
వారం మొత్తం పని చేసి అలిసిపోతారు. మాట్లాడుకోవడానికి అసలు సమయం ఉండదు. కనీసం వారాంతంలోనైనా మాట్లాడుకోకుంటే మీ బంధంలో ఎప్పుడు ఆఫీస్ ఇల్లు తప్ప వేరే కనపడదు. కాబట్టి ప్రేమగా కనీసం వారాంతంలోనైనా మాట్లాడుకోండి. ఇలా చేయడం వల్ల ఇద్దరిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.