Relation: వివాహమైన కొత్తలో చాలా మంది జీవితాలు అద్భుతంగా సాగుతాయి. అన్యోన్యంగా జీవిస్తుంటారు. అలాంటి బంధం కలకాలం నిలవాలంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సంసారంలో భాగస్వామిని కాస్త పట్టించుకోకపోయినా, లేదా బయట తిరగడం అలవాటు చేసుకొని ఇంటిని పట్టించుకోకపోయినా ఆ కాపురంలో చిచ్చు రేగే ప్రమాదం ఉంటుంది. బంధం ముక్కలు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధాలు, హతమార్చడాలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు దారి తీసే అవకాశం ఎక్కువ.
8 రకాలుగా వివాహేతర సంబంధాలు..
పెళ్లయిన వారిలో చాలా మంది 8 రకాల పరిస్థితుల వల్ల వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారట. ఇందులో ప్రతి దాని వెనుకా ఓ అర్థం ఉంటుందని చెబుతున్నారు. మొదటిది ఎమోషనల్ ఎఫైర్. ఇది ఎవరితోనైనా సంబంధంగా ప్రారంభమవుతుంది. అది స్నేహంగా మారుతుంది. మీరు సాధారణంగా పని చేసే ఆఫీసులోని వారితో, కొలీగ్స్ తో కలిసి పని చేస్తున్న సమంలో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడుతుందని ఓ సర్వేలో తేలింది. రాను రానూ ఈ వ్యవహారాలు లైంగిక బంధాలు మారే ప్రమాదం ఉందట.
రెండోది రొమాంటిక్ అఫైర్. జీవిత భాగస్వామి కాకుండా మరొకరు టచ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. సదరు వ్యక్తులతో ప్రేమలో పడడం, నియంత్రించుకోలేకపోవడం, ఆకర్షణ వల్ల మరో వ్యక్తితో అక్రమ బంధం ఏర్పరచుకోవడానికి కారణమవుతారు. తర్వాత యాక్సిడెంటల్ అఫైర్. రిలేషన్ లో ఏదీ కూడా అనుకోకుండా జరగదు. ఓ ఘటన జరిగితే దానికి సొంత భావాలను యాడ్ చేసి అక్రమ బంధం ఏర్పరచుకోవడానికి పూనుకుంటే యాక్సిడెంటల్ అఫైర్ కు కారణం కావొచ్చు.
మరో ఎఫైర్ లవ్ ట్రాక్. మ్యారేజ్ లైఫ్ లో ప్రేమ లేదని భావించే వారు ఈ కోవలోకి వస్తారు. ప్రేమను వెతుక్కుంటూ అక్రమ సంబంధం పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రేమ కోసం వెతికి రొమాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు. మరొకటి రొమాంటిక్ ఎఫైర్. ఓ వ్యక్తి తాను ఎక్కువగా ఇతరులతో శృంగారంలో పాల్గొనాలనే గోల్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక రివెంజ్ అఫైర్ కూడా ఉంటుంది. దీన్ని మొదలు పెట్టిన వారికి అసలు భయమే ఉండదు. తాము తప్పు చేస్తున్నట్లు జీవిత భాగస్వామికి తెలిసి వారు భయపడేలా చేస్తుంటారు.
Relation:
ఇక సైబర్ ఎఫైర్ కూడా ఉంటుంది. మోసం చేయాలనే భావన మనసులో ఉన్న వారు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వీరి తప్పులను ఎవరూ చూడలేరు కాబట్టి ఏదైనా చేయడానికి వెనుకాడరు. ఇక మరొకటి వదిలించుకొనేందుకు అఫైర్.. పెళ్లిని బ్రేక్ చేసుకొనేందుకు ఈ ఎఫైర్ ను పెట్టుకుంటారు చాలా మంది.