Record Viewership: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బుధవారం నాడు నరాలు తెగేలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుని గ్రూప్-2లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదంతా ఓ ఎత్తు అయితే ఈ మ్యాచ్ వ్యూవర్ షిప్ మరో ఎత్తుగా నిలిచింది. ఈ మ్యాచ్ రికార్డుస్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.
అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎంతో క్రేజ్ వచ్చింది. దాయాదులు తలపడటంతో ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అయితే బుధవారం పసికూన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ కూడా రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ దక్కించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ టీమిండియాకు ఇది ముఖ్యమైన మ్యాచ్ కావడంతో ఈ పోరును తిలకించేందుకు అందరూ మొబైళ్లకు అతుక్కుపోయారు.
దీంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వ్యూవర్ షిప్‌ను భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ దాటేసింది. 19 మిలియన్ల మంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ద్వారా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఈ సీజన్‌లోనే ఇది రికార్డుగా హాట్ స్టార్ యాప్ వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 18 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది.
Record Viewership: పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతు
బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా సెమీస్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. దక్షిణాఫ్రికాకు ఇంకాఅవకాశం ఉండగా.. బంగ్లాదేశ్‌కు కూడా ఛాన్స్ ఉంది. ఆ జట్టు పాకిస్థాన్‌పై గెలిచి జింబాబ్వేపై టీమిండియా ఓడిపోతే నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. కాగా ఇప్పటికే నెదర్లాండ్స్, జింబాబ్వే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.