Vrial News : 1947.. దేశ విభజన ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. అలాంటి కుటుంబాల్లో ఒకటి.. అమర్‌జిత్ సింగ్(అప్పటి పేరు తెలియదు) కుటుంబం. ఆ సమయంలో కొందరినే బృందాల వారీగా అనుమతించడంతో అమర్‌జిత్ సింగ్‌ను జలంధర్‌లోని పబ్వాన్ గ్రామంలో ఉన్న తన అన్న వద్దే వదిలి అతని తల్లి మిగిలిన పసికందులతో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. తన అన్న కుటుంబంతో కలిసి తన బిడ్డ పాక్‌కు తిరిగొస్తాడని భావించింది. కానీ పరిస్థితుల కారణంగా ఆమె అన్న వెళ్లలేకపోయాడు. ఆ తరువాత అనారోగ్యంతో అతను కూడా మరణించాడు. దీంతో అమర్‌జిత్ సింగ్ ఒంటరివాడై ఆలనాపాలనా చూసే వారు లేక రోడ్ల వెంట తిరిగేవాడు. సీన్ కట్ చేస్తే అనాథలా రోడ్ల వెంట తిరుగుతున్న అతన్ని పిల్లలు లేని ఓ జంట దగ్గరకు తీసింది.
భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి పెంచుకున్నారు. కడుపున పుట్టకున్నా.. అతనికి అమర్‌జిత్ అని పేరు పెట్టి సొంత బిడ్డగా ప్రేమను పంచారు. అయితే ఆ తల్లి చనిపోయే ముందు మాత్రం అంటే అమర్‌జిత్‌కు 75 ఏళ్ల వయసులో అతనికి అసలు నిజం చెప్పింది. దీంతో తనవారెవరో తెలియక.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పబ్వాన్‌లో ఆరా తీయడం మొదలుపెట్టాడు అమర్‌జిత్ సింగ్. చివరకు చనిపోయిన తన మేనమామ గురించి తెలుసుకోగలిగాడు. కానీ అతని కుంటుంబం జాడ మాత్రం తెలియరాలేదు. తనను పెంచిన కుటుంబం తనకు తోడైనా లాభం లేకపోయింది.
Vrial News : ఆమె ఎవరో కాదు.. ఆయన సోదరి కుల్సుం..
పాక్ నుంచి ఓ జర్నలిస్ట్.. పబ్వాన్‌లో ఉంటున్న ఉద్యమకారుడు హాన్స్ రాజ్‌కు ట్విటర్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చాడు. ఫలానా వ్యక్తి అంటూ అమర్‌జిత్ మేనమామ గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో అమర్‌జిత్ కాంటాక్ట్‌ను సంపాదించడంతో.. అవతల ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బుధవారం కార్తార్‌పూర్ గురుద్వార దగ్గర అమర్‌జిత్ సింగ్ పాక్ నుంచి వచ్చిన ఓ మహిళను కలిశాడు. ఆమె ఎవరో కాదు.. ఆయన సోదరి కుల్సుం. తాను పాక్‌కు వలస వెళ్లాక పుట్టానని, తల్లి ఏనాడో చనిపోయిందని.. అక్క కూడా ఆమధ్య చనిపోతూ సోదరుడి విషయం చెప్పిందని, అలా తన బంధం కోసం వెతుకుంటూ వచ్చానని ఖుల్సుం వివరించింది. మొత్తానికి రియల్ రక్తసంబంధం కథ 75 ఏళ్ల తర్వాత సుఖాంతమైంది.