అద్భుతమైన ఆట తీరుతో యావత్ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్న కోహ్లీ కెప్టెన్సీ విషయంలో మాత్రం ఆ రేంజ్ సక్సెస్ ను భారత్ కు అందివ్వలేకపోయాడు.అందుకే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అన్ని ఫార్మాట్స్ నుండి కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్నాడు.దీంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై బిసిసిఐ,ఆర్.సి.బి దృష్టి సారించాయి.సరిగ్గా ఇలాంటి సమయంలో క్రికెట్ సర్కిల్స్ లో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
దాని ప్రకారం ఆర్.సి.బి నూతన కెప్టెన్ కోసం ఇద్దరు యువ ఆటగాళ్లపై యాజమాన్యం దృష్టి సారించింది.రానున్న అక్షన్ లో వీరిని టార్గెట్ చేసే ప్లాన్ లో ఉందని సమాచారం.ఆ ఇద్దరిలో ఒకరు పంజాబ్ కెప్టెన్ కే.ఎల్ రాహుల్ కాగా, మరొకరు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ సారథి శ్రేయాస్ అయ్యర్ అని సమాచారం మరి వీరిద్దరిలో ఆర్సిబి తీర్థం ఎవరూ పుచ్చుకోనున్నారో వేచి చూడాల్సివుంది.