RC15: మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు రామ్ చరణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం RC15. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ప్రముఖ దర్శకుడు, క్రేజీ డైరెక్టర్ గా పేరు గాంచిన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీతో రెండోసారి కలిసి నటించనున్నారు రామ్ చరణ్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. అలాగే తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో 15వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందుకే క్రేజీ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు.
తాజాగా ఈ సినిమా గురించి ఓ లీకేజీ వచ్చింది. ఫొటోలు వైరల్ అయ్యాయి. అది తప్ప మిగతా ఏ అప్ డేట్ ఇంత వరకు లేదు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ను త్వరలోనే చేద్దామనే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ లాంచ్ ను కూడా గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం అనుకుంటోందట. హైదరాబాద్ తో పాటు ముంబైలోనూ ఈవెంట్ నిర్వహించేలా చూసుకోవాలని అనుకుంటున్నారట.
RC15: అతిథులుగా ఆ హీరోలు..
ఇందుకోసం కన్నడ స్టార్ యశ్, తమిళం, తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న హీరో సూర్య తదితరులు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. టీజర్ ఫస్ట్ లుక్ రాకముందే ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీని ఓవర్సీస్ లో ఓ సంస్థ రూ.15 కోట్లు పెట్టి దక్కించుకుందని టాక్.