RC15 Leaks: లీకుల వీరులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి బాధితుడు రామ్ చరణ్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఆర్సీ15 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ఫొటోలను లీకు వీరులెవరో డైరెక్ట్ గా నెట్టింట అప్ లోడ్ చేసేశారు. ఏం చేయాలో తెలీయ చిత్ర బృందం తలలు పట్టుకుంటోంది.
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఆర్సీ15 చిత్రం రానుంది. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు వినికిడి. వీటిలో కొన్ని ఫొటోలు లీకయ్యాయి. రామ్ చరణ్ భార్యగా హీరోయిన్ అంజలి ఉన్నట్లు ఆ ఫొటోల్లో స్పష్టంగా ఉంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. మరో ఫొటోలో రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడు. ఇలా కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. కియారా అడ్వాణీ, అంజలి. వీరిద్దరిలో ఎవరి క్యారెక్టర్ ఏంటనేది లీకు వీరుల కారణంగా ముందే జనాలకు తెలిసిపోయింది. కథ విషయానికి వస్తే రామ్ చరణ్ కుమారుడు ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడని తెలుస్తోంది. హీరోయిన్ కియారా కూడా గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తారట. వీరిద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటాయని టాక్.
RC15 Leaks:
సినిమాలో శ్రీకాంత్ సీఎం క్యారెక్టర్ పోషిస్తున్నారట. వెన్నెల కిశోర్, సునీల్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటే లీకు వీరులు మధ్యలోనే ఇలా లీక్ చేయడం చిత్ర యూనిట్ ను కలవర పెడుతోంది.