రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ రంపచోడవరం పరిసరాలలో జరుగుతుంది. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ కనిపిస్తాడని టాక్. ఇక అంజలి, కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి అధికారి అనే టైటిల్ పెట్టాలని శంకర్ భావిస్తున్నట్లు టాక్ వస్తుంది.
అయితే అఫీషియల్ గా మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవర్ ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రామ్ చరణ్ పాత్ర ఇందులో ఉండబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి వచ్చే ఏడాది వేసవి అవుతుందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ కూడా 2023 దసరాకి ఉండే అవకాశం ఉందని టాక్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీని ముందుగా రిలీజ్ చేసి తరువాత రామ్ చరణ్ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఏడాది సమయం పెట్టె అవకాశం ఉందని బోగట్టా.
ఇక రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసిన కన్నడ దర్శకుడు నార్తన్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని టాక్. ఇప్పటికే ఆ సినిమా కథ కూడా సిద్ధం అయిపోయిందని తెలుస్తుంది. యష్ కోసం అనుకున్న కథని నార్తన్ రామ్ చరణ్ కి చెప్పి ఒప్పించినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వినిపిస్తుంది.