మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే శంకర్ కి మరల ఇండియన్ 2 సినిమా స్టార్ట్ కావడంతో రామ్ చరణ్ మూవీ షూటింగ్ పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆ మూవీకి సంబందించిన షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత మరల రామ్ చరణ్ షూటింగ్ స్టార్ట్ చేస్తానని గతంలో చెప్పారు. అక్టోబర్ నెలలో ఆర్.సి 15 షూటింగ్ స్టార్ట్ చేసి చివరి షెడ్యూల్ ఫినిష్ చేస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు శంకర్ దృష్టి మొత్తం ఇండియన్ 2 మూవీమీదనే ఉంది.
ఈ నేపధ్యంలో ఇప్పట్లో రామ్ చరణ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ఇప్పట్లో తొందరేం లేదు అన్నట్లుగా ఇండియన్ 2 అయ్యాక రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్దామాని శంకర్ కి చెప్పినట్లు టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అయ్యే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా స్టార్ట్ చేసి 2023 ఆఖరులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమా కారణంగా రామ్ చరణ్ మరి ఇతర దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఏడాది పాటు షూటింగ్స్ లేకుండా ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనే మాట వినిపిస్తుంది.