ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 15వ చిత్రం చేయనున్నారు.ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు.ఈ మూవీ బడ్జెట్ బాగా పెరగడంతో నిర్మాత దిల్ రాజ్ ఈ మూవీని నిర్మించడానికి జీ స్టూడియోస్ తో కలిసి టై అప్ అయ్యారని సమాచారం.తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.