మోడీ సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడంపై దృష్టి సారించింది.అందులో భాగంగానే మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ ను బాగా ప్రమోట్ చేశారు.దాని ఫలితంగానే భారత్ ఆయుధాలు అమ్మే మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అనతి కాలంలో ఈ మార్కెట్ లోకి అడుగుపెట్టిన భారత్ కాస్ట్ ఎఫెషిఎన్స్,క్వాలిటీ తో కూడిన ఆయుధాలను అమ్ముతుండడంతో చిన్న దేశాలు భారత్ ఆయుధాలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సూపర్ పవర్ కావాలని కలలు కంటున్న భారతదేశం కొత్త కొత్త మార్కెట్స్ ను అన్వేషించాల్సివుంది.
దానికి భారత్ అగ్రదేశాల వలె భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అందుకోసమే భారత్ ప్రస్తుతమున్న విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంది.అందులో భాగంగా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.ప్రస్తుతం బంగారం ధర తక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న 734.84 టన్నుల బంగారాన్ని మరింత పెంచేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం ఎకానమిస్ట్ లు దృష్టిని ఆకర్షిస్తుంది.కొత్తగా కొనుగోలు చేసిన బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద ఉన్న 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి జోడించనున్నది.