POLITICS: ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ వెనుబాటు తనానికి గురైన విషయం అంరదికీ తెలిసందే. రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఏపీకి ముఖ్యమంత్రిగా సీమ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాయలసీమ వాదం బలంగా వినిపించేది. కానీ ఇఫ్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి, హక్కులపై నిలదీసే స్వేఛ్చ ఉండేది. ఇఫ్పుడు అలా కాదు.. ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా వెంటనే వాటిని అణిచివేసే విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో గతంలో ఉన్నంత బలంగా రాయలసీమ వాదం ఇప్పుడు వినించడం లేదు. కనీసం నోరెత్తడం కాదు కదా సోషల్ మీడియాలో కూడా స్వేచ్చగా వారి అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం లేదు.

దీంతో రాయలసీమ ప్రాంతంలో ఉన్న విద్యార్ధి సంఘం నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసి సమస్యలను విన్నవించేందుకు సిద్దం అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాస్తో కూస్తో రాయలసీమకు న్యాయం జరిగిందనే ఆలోచనతో ఉన్న వీరు ప్రస్తుతం విద్యా రంగంలో ఉన్న సమస్యలను నారా లోకేష్ తో సమావేశం అవ్వనున్నారు.
విద్యారంగ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి.. ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి అనే పలు ముఖ్యమైన అంశాలపై వీరు సమాలోచనలు చేయనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల విద్యార్ధి సంఘం నాయకులకు లోకేష్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీస్తున్న తరణంలో రాయలసీమ విధ్యార్ధి సంఘం నాయకులు నారా లోకేష్ ను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.