మాస్ మహారాజా రవితేజ హలో గురు ప్రేమ కోసమే,నేను లోకల్ ఫేం త్రినాథ్ రావు దర్శకత్వంలో ధమాకా అనే మూవీ చేస్తున్నారు.ఈ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ షెడ్యూల్ షూట్ అంతా హైదరాబాద్ లో జరిగిందని సమాచారం
ఈ మూవీకి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నది.ఈ షెడ్యూల్ ను శరవేగంగా పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.