Ravindra Jadeja: టీమిండియా ఆటగాళ్లను తరచుగా గాయాల సమస్య వేధిస్తుంది. గాయాల కారణంగా వరల్డ్ కప్ జట్టు నుంచి బుమ్రా మరియు రవీంద్ర జడేజా తప్పుకున్నారు. దీంతో టీమిండియాకు వరల్డ్ కప్ కు ముందే ఊహించని షాక్ తగిలింది. ఇది ఇలా ఉంచితే ఊహించని రీతిలో రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా వరల్డ్ కప్ జట్టులో ఆడడానికి జట్టులో చేరతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని కసరత్తులను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిట్నెస్ సాధిస్తే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ కప్ జట్టులో పాల్గొనే అవకాశం ఉంటుందని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి భారత జట్టులో రవీంద్ర జడేజా కి అద్భుతమైన ఆల్ రౌండర్ గా పేరుంది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లలో భారీ షాట్లు ఆడగల సామర్థ్యం జడేజాకు ఉంది.
టీమిండియా ఆసియా కప్ ఆడుతుండగా రవీంద్ర జడేజా గాయపడ్డాడు. దీంతో ఆసియా కప్ మధ్యలోనే వెనుదిరుగాల్సి వచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్ గా లేకపోయిన చిన్నపాటి కసరత్తులను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన పోస్టును ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
Ravindra Jadeja:
వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇందులో ఒక్కరు మాత్రమే తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా లేని కారణంగా హార్దిక్ పాండ్యా మాత్రం జట్టులో కీలక ఆల్ రౌండర్ గా మారనున్నాడు. గాయం కారణంగా ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ జట్టుకు కూడా రవీంద్ర జడేజా దూరమైన సంగతి మనకు తెలిసిందే.
🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️ pic.twitter.com/GhHGW5xaV4
— Ravindrasinh jadeja (@imjadeja) October 19, 2022