మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ధమాకా సినిమా షూటింగ్ లో ఉన్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇది సౌత్ లాంగ్వేజ్ లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇక ఇవి లైన్ లో ఉండగానే సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అయిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రవితేజ రెడీ అయ్యాడు. ఇక ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని రవితేజ అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకి ఈగల్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక రవితేజకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ని ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు ఓ హాట్ న్యూస్ రన్ అవుతుంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని హాలీవుడ్ మూవీ ఫ్రీమేక్ గా ఈగల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడని టాక్. హాలీవుడ్ లో కీను రివీస్ లీడ్ రోల్ లో నటించిన మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ జాన్ వీక్ మూవీ ఫ్రీమేక్ గా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం.
అయితే 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ కొత్తగా ఉన్న హాలీవుడ్ ఆడియన్స్ కి అలవాటున్న యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కావడంతో పెద్దగా సక్సెస్ కాలేదు. కార్తిక్ కి ఈ మూవీలో స్టోరీ లైన్ బాగా కనెక్ట్ కావడంతో దానిని తీసుకొని తన స్టైల్ లో మార్చుకొని ఇండియనైజ్ చేసి ఇక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కూడా రాసుకొని కథని సిద్ధం చేసి రవితేజకి వినిపించాడని టాక్. ఇక రవితేజకి కార్తీక్ చెప్పిన నేరేషన్ నచ్చడంతో ఒకే చెప్పాడని తెలుస్తుంది. మరి ఈ ఈగల్ రవితేజకి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి ఇమేజ్ ఇస్తుందనేది చూడాలి.