Ravi Teja: మాస్ మహారాజ రవితేజ సినిమాలు మినిమం గ్యారెంటీ అని నమ్ముతారు ఫ్యాన్స్. తాజాగా ఆయన నటించిన క్రాక్ సినిమా హిట్ అయ్యాక, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక తరువాత తీయబోయే సినిమాపై రవితేజ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రవితేజ ధమాకా చిత్రంలో నటిస్తున్నారు. త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
దించక్ పాట నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. యూట్యూబ్ సహా మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లపై ఓ ఊపు ఊపేస్తోంది. విడుదల తేదీ కోసం చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. సరైన ముహూర్తం ఖరారైతే మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడయ్యే చాన్స్ ఉంది. ఈ సినిమాలో అయినా సరైన కంటెంట్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తమిళ చిత్రం మానాడు అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దీన్ని రీమేక్ చేయాలని రవితేజ డిసైడ్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దీని హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ వద్ద ఉన్నాయి. దీని స్క్రిప్ట్ బాధ్యతలు డైరెక్టర్ హరీష్ శంకర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. దశరథ్ కు దర్శక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Ravi Teja: పోలీస్ ఆఫీసర్ గా రవితేజ..
తమిళ్ లో వచ్చిన మానాడు చిత్రంలో శింబు చేసిన పాత్ర సిద్ధు జొన్నలగడ్డకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ జే సూర్య అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు కాబట్టి.. రవితేజ ఆ క్యారెక్టర్ లో ఫిక్స్ కావాల్సి ఉంటుంది. ఇది ఓ రకంగా రిస్కనే చెబుతున్నారు. అందులో నటన పరంగా చాలా షేడ్స్ ఉన్నాయి. అయితే హీరోగా కాదు. మరి రవితేజ నిజంగా అందుకు ఒప్పుకున్నాడా అనేది ప్రశ్నార్థకం. దీనిపై అధికారికంగా సమాచారం వస్తే తప్ప కన్ఫం కాదని అనుకోవాలి.