Reshmika Mandana: కన్నడ బ్యూటీ రష్మిక మందన “చలో”తో తెలుగు ప్రేక్షకులను పలకరించి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత “గీతాగోవిందం”తో మరింత దగ్గరయ్యింది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ తో “సరిలేరు నీకెవ్వరు”లో నటించి బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన “పుష్ప” తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. “నా సామి”.. పాటలో రష్మిక వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే.
“పుష్ప” విజయంతో రష్మిక మందన వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు తిరుగులేని క్రేజ్ ఉన్న రష్మిక ప్రస్తుతం హిందీలో వికాస్‌భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘గుడ్‌బై’ లో నటించడం జరిగింది. అక్టోబర్ 7వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా గురించి ఇటీవల రష్మిక మందన మాట్లాడుతూ…”గుడ్‌బై”లో తారా భల్లా అనే యువతి పాత్రలో నటించిన్నట్లు స్పష్టం చేసింది.
కుటుంబ ప్రేమానుబంధాలకి సంబంధించి అద్భుతమైన భావోద్వేగం కలిగిన స్టోరీ అని చెప్పుకొచ్చింది. మూఢ విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్ని ప్రశ్నిస్తూనే భావోద్వేగాల్ని చక్కగా అర్థం చేసుకునే అమ్మాయిగా తారా భల్లా పాత్ర తన కెరీర్‌లో ప్రత్యేకమని తెలియజేసింది. అయితే తన కెరియర్ లో ఫస్ట్ టైం హిందీ డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని పేర్కొంది. మాతృభాష కన్నడ కావటంతో హిందీ డబ్బింగ్ స్టార్టింగ్ లో కష్టమైంది ఆ తర్వాత ట్రైనింగ్ కావడంతో.. విజయవంతంగా పూర్తి చేశా అని రష్మిక చెప్పుకోచ్చింది. ప్రస్తుతం పుష్ప 2, NTR 30 ప్రాజెక్టులలో నటిస్తూ ఉంది.