Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అమ్మడు ఇప్పుడు ఒకరకంగా బాలీవుడ్‌ని ఏలేస్తుంది. వరుస సినిమాలు చేస్తూ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని బాగా వంటబట్టించుకుందో ఏమో కానీ.. అమ్మడు మాత్రం ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తూ పోతోంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‌తో రష్మిక క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సౌత్ సహా నార్త్‌లోనూ వరుస ఆఫర్లతో యమ బిజీగా అయిపోయింది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు గట్టి షాక్ తగిలింది. ఆమె నటిస్తున్న సినిమా ఆగిపోయినట్లు సమాచారం.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి రష్మిక ‘స్క్రూ ఢీలా’ అనే చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టైగర్‌కు రూ.35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేశాడు. అయితే ప్రస్తుతం సినిమాల బడ్జెట్ పెరిగి పోతుండటంతో బడ్జెట్ తగ్గించుకోవాలని నిర్మాతలు యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ తగ్గించుకోవడంలో భాగంగానో.. మరొకటో కానీ.. కరణ్ జోహార్.. షూటింగ్ మొదలయ్యాక టైగర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని కోరారట.
Rashmika : రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని అడిగారట..
పారితోషికం ఇవ్వడానికి ముందు అడిగి ఉంటే ఎలా ఉండేదో కానీ.. తీసుకుని సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక రెమ్యునరేషన్ తగ్గించుకోమని కోరితే ఏ హీరో అయినా ఎలా ఒప్పుకుంటాడు? అదే జరిగింది ఇక్కడ. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్ అడిగారట. ఇందుకు ఇందుకు టైగర్ ష్రాఫ్ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బీటౌన్ టాక్. దీంతో టైగర్ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్ మిస్సయినట్లైంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.