Rashmika Mandanna : సౌత్ బ్యూటీ రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందమైన లుక్స్ కు, వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ నేషనల్ క్రష్ బిరుదు కూడా ఇచ్చారు. ఇటీవల మెరూన్ గౌనులో ఒక అవార్డ్ షోకు హాజరై అందరిని అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ అవుట్ ఫిట్ తో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna : డిజైనర్ ద్వయం గౌరీ , నైనికా లు డిజైన్ చేసిన అందమైన గౌనులో రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు రష్మిక మందన్న అద్భుతంగా కనిపించింది. ఆమె అందాలను చూసిన అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. మెరూన్ బ్యాక్ డ్రాప్ లో ముల్తి కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ తో డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ రష్మిక కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్లంగింగ్ నెక్ లైన్ తో ఓపెన్ బ్యాక్ ఈ అవుట్ ఫిట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

చెవులకు సిల్వర్ కలర్ సింపుల్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. కనులకు బ్లాక్ ఐ లైనర్ , న్యూడ్ ఐ ష్యాడో , బ్లాక్ మస్కారా వేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేస్తోంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ మరో స్టైలిష్ అవుట్ ఫిట్ వేసుకుని అదరగొట్టింది. గ్రీన్ కలర్ బ్లేజర్ టాప్ వేసుకుని కుర్రాళ్ళ టాప్ లేపేసింది. లేస్ బ్రాలెట్ వేసుకుని దానిపైన ఫుల్ స్లీవ్స్ బటన్ డీటెయిల్స్ , కాలర్ డిజైన్ తో వచ్చిన బ్లేజర్ వేసుకుని మెస్మరైజ్ చేసింది.

ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా మేకోవర్ అయ్యి అదరగొట్టింది రష్మిక . మెడలో బ్లూ కలర్ పెండెంట్ తో వచ్చిన గోల్డ్ చైన్ , చేతికి ఉంగరాలు , చెవులకు గోల్డ్ స్టడ్స్ పెట్టుకుంది. తన కురులను లూస్ గా వదులుకుని , పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.