రష్మిక మందన బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కంటుంది. అయితే ఆమె ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. సౌత్ లో పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక ఎస్టాబ్లిష్ అవుతున్న కూడా బాలీవుడ్ లో మాత్రం ఆమెకి అనుకున్న స్థాయిలో గ్రాండ్ వెల్ కమ్ దక్కలేదు. అమితాబచ్చన్ లాంటి స్టార్ తో గుడ్ బై సినిమాలో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కూతురుగా ఈ బ్యూటీ నటించింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక రెండో సినిమాగా సిద్దార్ద్ మల్హోత్రాతో మిషన్ మజ్ను అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించింది.
ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాని ఏవో కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇంతకానికి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి బాలీవుడ్ లో పాగా వేయొచ్చు అనే ఆలోచనతో రష్మిక ఉంది. అయితే ఊహించని విధంగా ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా దృవీకరించారు. ఇప్పటికే ఈ మూవీ ఒటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థకి మంచి ధరకి అమ్మేసినట్లు తెలుస్తుంది.
థియేటర్స్ లో రిలీజ్ చేసిన అనుకున్న స్థాయిలో బజ్ రాదనే ఆలోచనతోనే నిర్మాతలు ఒటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. జనవరి ఫెస్టివల్ టైంలో ఈ మూవీ ఒటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని బోగట్టా. మొత్తానికి మొదటి సినిమా డిజాస్టర్ కాగా రెండో సినిమా ఇప్పుడు నేరుగా ఒటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ నేపధ్యంలో ఆమె బాలీవుడ్ ఆశలు తీరడం ఇప్పట్లో కష్టం అనే మాట వినిపిస్తుంది.ఇక ఆమె హోప్స్ అన్ని కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే యానిమల్ సినిమాపైనే హోప్స్ అన్ని పెట్టుకుంది.