దేశవ్యాప్తంగా పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో రష్మిక మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అనంతరం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. గతేడాదిలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సాధించింది. అలా వచ్చిన పాపులారిటీతో బాలీవుడ్‌లో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఈ తార తాజా చిత్రం ‘గుడ్ బై’ మూవీ త్వరలో విడుదల కానుంది. దాంతో మూవీ ప్రమోషన్స్ లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆ ఇంటర్వ్యూలో ‘మీరు మీ ప్రస్తుత బోయ్ ఫ్రెండ్‌తో బయటికి వెళ్లినప్పుడు.. అక్కడి మాజీ ప్రియుడు కనిపిస్తే ఏం చెబుతారు అని హోస్ట్ అడిగాడు. దానికి సమాధానంగా రష్మిక మాట్లాడుతూ.. ‘నేను కచ్చితంగా వెళ్లి పలకరిస్తాను. ఎందుకంటే.. నా మాజీ బాయ్‌ఫ్రెండ్స్ అందరితో నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. వాళ్ల కుటుంబాన్ని కూడా కలుస్తుంటాను. అంతేకాకుండా.. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసుకుంటాను. మాజీ ప్రియుళ్లతో అలా క్లోజ్‌గా ఉండడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటారు. కానీ నాకు మాత్రం మంచిదే అనిపిస్తుంది. అలాగే వారి ప్రస్తుతం ప్రియురాళ్లతో కూడా క్లోజ్ గానే ఉంటాను’ అని చెప్పుకొచ్చింది.
అయితే.. రష్మిక కెరీర్ ప్రారంభంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత వారిద్దరికీ ఎంగేజ్‌మేంట్ కూడా జరిగింది. తరువాత ఆ నిశ్చితార్థాన్ని పలు కారణాల వల్ల బ్రేక్ చేసుకుంది. అనంతరం టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండతో వరుసగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చేయడంతో.. వారిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ.. ఈ విషయం గురించి అడిగినప్పుడల్లా.. తాము మంచి స్నేహితులం అని, తమ మధ్య అలాంటిది ఏం లేదని.. రష్మిక, విజయ్ కొట్టిపారేశారు. కాగా.. రష్మిక ‘గుడ్ బై’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో, అలాగే ‘మిస్టర్ మజ్ను’లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. అలాగే.. ‘పుష్ప 2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.