హాట్ బ్యూటీ, యూత్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ పాగా వేయడానికి గట్టిగానే తన ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ నుంచి ఏ హీరోయిన్ ని లేనంత క్రేజ్ ఈ అమ్మడుకి లభిస్తుంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీనే రష్మికకి దొరికింది. దీంతో అక్కడ గట్టిగా పునాదులు వేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన స్థాయిలో సినిమాల ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం అమితాబచ్చన్ తో చేసిన గుడ్ బై సినిమా ప్రమోషన్ లో రష్మిక చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. దీని తర్వాత మిషన్ మజ్ను కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. వీటితో పాటు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు.
ఇది పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్. దీనితో పాటు కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కబోతున్న బాలీవుడ్ సక్సెస్ ఫుల్ సీక్వెల్ ఆషికి3 కోసం రష్మికతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కార్తీక్ ఆర్యన్, రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటంతో దర్శక, నిర్మాతలు, హీరో రష్మికకె ఓటు వేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు హాలీవుడ్ రాంబో సిరీస్ ని టైగర్ ష్రాఫ్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ ని ఫినిష్ చేశారు. ఇప్పుడు రాంబో పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఆమె కూడా సుముఖంగానే ఉందని, ఇక అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో రష్మిక బిటౌన్ ని షేక్ చేస్తుంది. సౌత్ లో కూడా కార్తీకి జోడీగా జపాన్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో వైపు పుష్ప 2, వారసుడు సినిమాలు సౌత్ నుంచి ఈమె చేతిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది మొత్తం ఈ బ్యూటీ మెజారిటీ సినిమాలతో ప్రేక్షకులని పలకరించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.