సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె నటించిన వారసుడు మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మరో వైపు పుష్ప 2 మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం రష్మిక మందనని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే యానిమల్ సినిమా కూడా సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అదిరిపోయే క్రేజ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా ఒకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.
అలాగే సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో ఇరగదీసింది. ఇక తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా ఐటెం సాంగ్స్ తో మెప్పించారు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే మంచి రెమ్యునరేషన్ ఇస్తే ఐటెం సాంగ్స్ చేయడానికి ఎలాంటి సందేహం లేకుండా ఒకే చెప్పేస్తున్నారు. ఇక ఇప్పుడు రష్మిక కూడా అలాగే ఐటెం సాంగ్ చేయడానికి ఒకే చెప్పిందనే టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీల ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ కోసం త్రివిక్రమ్ రష్మికని సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కోసం రష్మిక కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఐటెం సాంగ్ లో నర్తించడానికి ఒకే చెప్పిందనే మాట వినిపిస్తుంది. త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ ఆఖరులో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.