[ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా ఇండియన్ వైజ్ గా మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా, యూత్ క్రష్ గా ఉన్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు కెరియర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో వెళ్తుంది. ఓ వైపు తెలుగులో పుష్ప2, వారసుడు లాంటి భారీ బడ్జెట్ మూవీలలో స్టార్ హీరోలకి జోడీగా నటిస్తుంది.
అలాగే హిందీలో కూడా వరుస అవకాశాలని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ మిషన్ మజ్ను అనే కమర్షియల్ మూవీతో పాటు గుడ్ బై లాంటి కంటెంట్ బేస్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
దీంతో పాటు కొరటాల, తారక్ సినిమాలో రష్మికనే హీరోయిన్ అనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది. పాన్ ఇండియా బ్యూటీగా రష్మిక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న కార్తిక్ ఆర్యన్ కి జోడీగా ఆషికి-3మూవీలో రష్మికని హీరోయిన్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
రీసెంట్ గా కార్తీక్ ఆర్యన్ తో రష్మిక ఓ యాడ్ చేసింది. ఆ యాడ్ లో వారిద్దరి జోడీ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. జోడీ పెర్ఫెక్ట్ గా ఉందనే మాట వినిపించింది. దీంతో ఆషికి-3 కోసం ఆమెని ఫైనల్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. వీటితో పాటు తమిళ్ లో కూడా సూర్యకి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది.
ఇలా చేతినిండా ప్రాజెక్ట్ లతో రష్మిక మందన ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు పెట్టి యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా షర్ట్ సగం వరకు విప్పేసి ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది.