చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. కానీ అవి పెద్దగా అయితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఆడుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఆ తప్పు కప్పిపుచ్చే లోపు కంపు కంపు అయిపోతుందంటారు. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
ఈ సినిమా జనవరి 7న ఓటిటిలో విడుదలైంది. హిందీ మినహా అన్ని భాషల్లోనూ విడుదలైంది పుష్ప. అమెజాన్ ప్రైమ్ వీడియాలో ఈ సినిమా విడుదలైంది. అక్కడ కూడా పుష్పకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో విడుదలైన సినిమాలో లేని కొన్ని సన్నివేశాలు ఓటిటిలో కనిపిస్తున్నాయి. వాటిని చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో దొరికిపోయాడు.సినిమాలో ఎలాంటి తప్పులు లేవు కానీ చివరికి టైటిల్స్ విషయంలో మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు. హీరోయిన్ రష్మిక మందన్న పేరును మార్చేసింది అమెజాన్. ఆమె పేరును రష్మిక మందన్న అయితే.. అక్కడ రష్మిక మడోనా అని పడింది. అలా కనిపించేసరికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
రష్మిక మందన్న మాకు తెలుసు.. ఈ రష్మిక మడోనా ఎవరబ్బా అంటూ అప్పుడే రచ్చ మొదలైపోయింది. మరి ఈ పేరు తప్పు అని అమెజాన్ వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్న సినిమాలో సైతం రష్మిక మడోనా అనే పేరు కనిపిస్తుంది. అది చూసి ట్రోలింగ్ మరింత పెరుగుతుంది.
రష్మిక మందన్న పేరు ఇప్పటికైనా మార్చండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ఈమె శ్రీవల్లి పాత్రలో నటించింది. రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కెరీర్‌లో మొదటిసారి డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించింది రష్మిక. సుకుమార్ కూడా శ్రీవల్లి పాత్రను బాగానే డిజైన్ చేసాడు. రెండో భాగం షూటింగ్ ఫిబ్రవరి 2022 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 2022లో పుష్ప ది రూల్ విడుదల కానుంది.