Rashmika Mandanna : అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, రష్మిక మందన్న నటిచిన గుడ్ బై చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో, యాడ్ షూట్స్‌తో విరామం లేకుండా శ్రమించిన నటి రష్మిక ఇప్పుడు విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోయింది. తాజాగా ఈ చిన్నది బీచ్ హాలిడే నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఫుల్‌లెన్త్‌లో ఎంజాయ్ చేస్తోంది. బీచ్ వెకేషన్‌కు సంబంధించిన పిక్స్‌ను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna : బాలీవుడ్‌లో మొదటి సారి గుడ్ బై చిత్రంతో తెరంగేట్రం చేసింది సౌత్ బ్యూటీ రష్మిక మందన్న. మొదటి సినిమా కావడంతో ప్రమోషన్స్‌తో ఓ లెవెల్ క్రేజ్‌ను పెంచుకుంది రష్మిక. అంతే కాదు రౌడీ బాయ్ విజయదేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు చెలరేగాయి. అయితే ఇవేమి పట్టించుకోకుండా ఈ మల్లు బ్యూటీ తన హాలిడేస్‌ను ద్వీప దేశంలో స్పెండ్ చేస్తోంది. ప్రకృతి మధ్యన, బీచ్ లొకేషన్‌లో ఆమె స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్‌ను తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ పుష్పా స్టార్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేయడమే కాదు, బీచ్ ఫ్యాషన్ గోల్స్‌ను అందించింది.

మొదటి రోజు మాల్దీవ్స్‌లో ఆఫ్ వైట్ షేడ్‌లో వచ్చిన ప్రింటెడ్ కట్ అవుట్ గౌన్‌లో అదరగొట్టింది రష్మిక. రిసార్ట్ పూల్ దగ్గర కూర్చుని దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వచ్ఛమైన నీలి ఆకాశం, క్రిస్టల్ బ్లూ పూల్ నీటిని చూస్తూ పువ్వులతో అలంకరించిన పూల్ ట్రే లోని రుచికరమైన భోజనాన్ని ఆస్వాధించింది.

బీచ్ లుక్‌లో ఎంతో క్యూట్‌గా కనిపించింది రష్మిక. ఫ్లోరల్ ప్యాట్రన్స్, పాస్టెల్ బ్రౌన్ షేడ్స్‌తో వచ్చిన ఈ అవుట్ ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది. స్ట్రాపెడ్ స్లీవ్స్, స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, డ్రెస్ ముందు భాగంలో వచ్చిన కట్ అవుట్ డీటైల్స్ , ప్లీటెడ్ డిజైన్స్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ రష్మిక ఫిగర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మినిమల్ ఆక్సెసరీస్‌ను ధరించింది రష్మిక. కనులకు బ్లాక్ టింటెడ్ సన్‌గ్లాసెస్, మెడలో స్లీక్ గోల్డ్ చైన్ పెట్టుకుంది. తన కురులతో అందమైన స్లీక్ పొనీటైయిల్ వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుని వితౌట్ మేకప్‌తోనే ఎంతో మెస్మరైజ్ చేసింది ఈ నాచురల్ బ్యూటీ.

సెకెండ్ డే బికినీ వేసుకుని పూల్‌లో అందాలతో రచ్చ రచ్చ చేసింది రష్మిక మందన్న. బ్లూకలర్ స్విమ్ సూట్ వేసుకుని రిసార్ట్ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూ సేదతీరుతున్న పిక్ ను ఇన్‌స్టాలో షేర్ చేసంది. ప్రసత్తుం పుష్ప 2 తో పాటు బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది రష్మిక. సిద్దార్ధ్ సరసన మిషన్ మజ్ను, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఆనిమల్‌లో రణ్‌బీర్ కపూర్ సరసన మెరవనుంది.

