Rashmika Mandanna : టాలీవుడ్‌ను తన నటనతో, అందంతో ఓ ఊపు ఊపేసిన మాస్ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్‌లోనూ భారీ తెరంగేట్రానికి సిద్ధమైంది. పుష‌్ప హిట్‌తో పాన్ ఇండియన్ స్టార్ అయిన ఈ అందాల భామ నార్త్‌లోనూ తన సత్తా చూపించేందుకు సిద్ధమైంది. రష్మిక ప్రస్తుతం తన మొదటి హిందీ చిత్రం గుడ్‌బై విడుదల కోసం ఎదురుచూస్తోంది.

బాలీవుడ్‌లో మకాం వేసిన రష్మిక మూవీ ప్రమోషన్‌లో తలమునకలైంది. ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌తో మూవీ ప్రమోషన్స్ చేస్తూ బీ టౌన్‌ను అలర్ట్ చేస్తోంది.

Rashmika Mandanna : వికాస్ భల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా గుడ్‌బై. అమితాబ్ బచన్, నీనా గుప్తాలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న రష్మిక ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రమోషన్ డైరీస్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేజర్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఎత్నిక్ అవుట్‌ఫిట్ నుంచి క్యాజువల్ వేర్ వరకు ప్రతి లుక్‌లో ఫెర్ఫెక్ట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోచేస్తోంది.

తాజాగా రష్మిక వైట్ అవుట్‌ఫిట్ వేసుకుని అదిరిపోయే లుక్‌లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. రష్మిక ఫ్యాషన్ డిజైనర్ గౌర్వివ్ దేశాయ్‌కి మ్యూజ్‌గా వ్యవహరించింది. ప్రమోషన్ డ్యూటీస్‌లో భాగంగా చేసిన ఫోటో షూట్ కోసం తెల్లటి గౌన్‌ను ఎన్నుకుంది. ఈ బాడీకాన్ డ్రెస్‌లో మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపించి ఫ్రెష్ లుక్‌లో అదుర్స్ అనిపిస్తోంది రష్మిక.

కాలర్స్ నుంచి థైస్ వరకు స్లాంటింగ్ ప్యాట్రన్స్‌తో వచ్చిన బటన్స్ అవుట్‌ఫిట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌ను అందించాయి. ఇక నడుముపైన షర్ట్ స్టైల్ డీటైల్స్ అందించారు డిజైనర్. ఫుల్ స్లీవ్స్‌తో థై హై స్లిట్‌తో వచ్చిన ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ రష్మిక ఒంపుసొంపులను స్పష్టంగా చూపిస్తోంది.

రష్మిక అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది. చెవులకు బంగారపు ఇయర్ స్టడ్స్ పెట్టుకుంది. పాదాలకు నలుపు రంగు ఫుట్‌వేర్ వేసుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహెర్ రష్మికకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. క్లీన్ పోనీటైయిల్ వేసుకుని మినిమల్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టింది. కనులకు ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకుంది పెదాలకు పాస్టెల్ మెరూన్ లిప్‌స్టిక్ పెట్టుకుంది.