Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా లలో నటిస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఇకపోతే ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
అంతే కాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. రష్మిక ఇటీవలే గుడ్ బై సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉండగా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రష్మిక మందన సినిమాలలో నటిస్తూ కాస్త గ్యాప్ దొరికింది అంటే చాలు వెంటనే వెకషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈమె మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
గత వారం రోజులుగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నే ఉంది.
రష్మిక మందన కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన అతని ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఫోటోలను రష్మిక మందిన పద్ధతిగా చీరలో కనిపిస్తూనే తన అందాలతో చెమటలు పట్టిస్తోంది. ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.