Rashmika Mandanna: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ , నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో ఊహించని విధంగా భారీగా పాపులారిటిని సంపాదించుకుంది.
తెలుగుతో పాటు ఇతర బాషలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల రష్మిక మందన గుడ్ బై సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఇక తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది.
అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా పంచుకుంటూనే ఉంది. అక్కడే బీచ్ లో తన అందాలను ఆరబోస్తు ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో రష్మిక తన అందాలను ఆరబోస్తూ బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే సినిమాలో షూటింగ్ తో బిజీబిజీగా గడిపిన రష్మిక మందన ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది.