Rashmika Mandanna : రష్మిక మందన్న తన అద్భుతమైన స్టైల్స్ తో మనల్ని ఎప్పుడూ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ మంగళూరు బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఇటీవలి ఫ్యాషన్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుని కుర్రాళ్ళను ఫిదా చేసేసింది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగా ధరించి, ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఎత్నిక్ వేర్ లో అమేజింగ్ లుక్ లో కనిపిస్తూ యూత్ కు చెమటలు పట్టిస్తోంది.

Rashmika Mandanna : రష్మిక ఒక సంపూర్ణమైన ఫ్యాషన్‌వాది. మోడరన్ అవుట్ ఫైట్స్ నుంచి మేస్మెరిసింగ్ ఎత్నిక్స్ వరకు ఏ లుక్ లో కనిపించిన కుర్రాళ్ళకు మతులు పోవాల్సిందే ఈ బ్యూటీ తన ఉత్తమ అవుట్ ఫిట్స్ ధరించిన డైరీలలోని స్నిప్పెట్‌లతో అభిమానులను ఎప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. క్యాజువల్ వేర్ నుంచి శారీ లుక్ వరకు అన్నింట్లోనే రష్మిక తన దైన స్టైల్ ను జోడించి అభిమానులను అలరిస్తుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్ నుండి తాజా చిత్రాలను షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ మిశ్రూకు మ్యూజ్‌గా వ్యవహరించింది రష్మిక. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్ నుండి ఎరుపు రంగు లెహంగాను ఎంచుకుంది. ఎరుపు రంగు జరీ , సీక్విన్ వివరాలతో వచ్చిన స్లిప్ రెడ్ బ్లౌజ్ ను వేసుకుని , దానికి జోడిగా ఎరుపు జరీ వివరాలతో వచ్చిన పొడవాటి ఎర్రటి స్కర్ట్ ని జత చేసింది. బార్డర్‌ల వద్ద ఎర్రటి జరీ ప్యాటర్న్‌ల డిజైన్ తో వచ్చిన రెడ్ శాటిన్ దుపట్టాను వేసుకుని తన లుక్‌కి మరింత అట్రాక్షన్ ను జోడించింది. ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన రష్మిక లెట్స్ స్లోలి స్టార్ట్ గెట్టింగ్ బ్యాక్ తో బిజినెస్ నౌ అని క్యాప్షన్ ను జోడించింది.

రష్మిక తన లుక్ కి మ్యాచింగ్ గా ఆమ్రపాలి జ్యువెల్స్ హౌస్ నుండి వెండి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ను సేకరించి చేతులకు వేసుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ రశ్మికకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ మెహక్ ఒబెరాయ్ సహాయంతో రష్మిక తన అందానికి మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్,మస్కరాను వేసుకుంది . పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని తన గ్లామరస్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.