
Rashmika Mandanna : ట్రెండీగా , గ్లామరస్‌గా కనిపించాలనుకోవడం ప్రతి హీరోయిన్ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటానికి తమ అభిమానులను అలరించడానికి హీరోయిన్లు ఎక్కువ సమయాన్ని తమ మేకోవర్ కోసమే వెచ్చిస్తుంటారు. ఉత్తమ ఫ్యాషన్ లుక్స్‌ను ప్రదర్శిస్తుంటారకు. కానీ సందర్భానుసారంగా, వెళ్లే ప్రదేశాన్ని బట్టి దుస్తులు ఎన్నుకోవం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది సౌత్ బ్యూటీ క్యూట్ అండ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా. ముంబైలోని లాల్‌బాగ్‌లోని లాల్‌బాగ్చా రాజా గణేష్ మండపాన్ని రష్మిక సందర్శించింది. అయితే మండపానికి వచ్చిన రష్మిక డ్రెస్సింగ్ సెన్స్ ఆమెకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. గణేష్ పండపానికి ఇలాంటి డ్రెస్‌తో వస్తావా అంటూ భక్తులు ఫైర్ అవుతున్నారు.
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక త్వరలో విడుదల కానున్న గుడ్ బై చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కోసం బికినీ టాప్ పైకి ఓపెన్ కోట్ దానికి మ్యాచింగ్‌గా పూల లెహెంగా ను ధరించింది కన్నడ బ్యూటీ రష్మిక త్వరలో విడుదల కానున్న గుడ్ బై చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కోసం బికినీ టాప్ పైకి ఓపెన్ కోట్ దానికి మ్యాచింగ్‌గా పూల లెహెంగా ను ధరించింది తన గ్లామరస్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె తన ఒంపులను ప్రదర్శించి అందరిని కవ్వించింది. అయితే అదే డ్రెస్‌తో గణేష్ మండపానికి వెళ్లి పెద్ద తప్పు చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రష్మిక డ్రెస్సింగ్ సెన్స్‌పైన సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. గణేషున్ని దర్శించుకునే సమయంలో రష్మిక తన కోట్ బటన్స్ పెట్టుకున్నప్పటికీ మరింత డీసెంట్ డ్రెస్‌తో సంప్రదాయబద్ధంగా మండపానికి వెళ్లి ఉండాల్సిందని సూచిస్తున్నారు. మరి తన డ్రెస్సింగ్ పైన వస్తున్న విమర్శలకు రష్మిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ చందనాల బొమ్మ పుష్పా 2 ‘ది రూల్’ చిత్రంలో నటిస్తూనే సిద్ధార్థ మల్హోత్రాతో మిషన్ మజ్నూ, దలపతి విజయ్‌తో వారీసు చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా హిందీ, తెలుగు ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ తోనూ చర్చలు జరుపుతోంది.