ప్రస్తుతం సౌత్ ఇండియా క్రష్ గా మారిన రష్మీక మందాన అన్ని లాంగ్వేజెస్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తూ బాగా బిజీ అయిపోయింది.గతంలో బాద్షా టాప్ టక్కర్ సాంగ్ లో కనిపించి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రష్మీక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తున్న గుడ్ బై మూవీలో కూడా రష్మీక మందాన హీరోయిన్ గా కనిపించనున్నది.ఇంకా ఈ మూవీ అఫిషియల్ డేట్ అనౌన్స్ చేయనప్పటికి ప్రస్తుతం అందిన సమాచారం మేరకు ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతుంది.ఒకవేళ ఇది నిజమైతే రష్మీక మందాన బాలీవుడ్ భవిష్యత్తు సమ్మర్ లో డిసైడ్ కానున్నది.
ఈ రెండు మూవీలతో బాలీవుడ్ లో తనకు గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుందని తన కెరియర్ గ్రాఫ్ మారుతుందని రష్మీక మందాన భావిస్తుంది.అందుకే రష్మీక టాలీవుడ్ లో తనకు వస్తున్న భారీ ఆఫర్స్ ను తిరస్కరిస్తుందని సమాచారం.ప్రస్తుతం రష్మీక మందాన టాలీవుడ్ లో పుష్ప,ఆడవాళ్ళకు మాత్రమే జోహార్లు మూవీలలో హీరోయిన్ గా నటిస్తుంది.మరి రష్మీక తీసుకున్న రిస్క్ ఆమెకు ఆశించిన బాలీవుడ్ బ్రేక్ ను ఇస్తుందో లేదో వేచి చూడాలి.