లవ్ స్టోరీ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ మధ్య కోలీవుడ్ స్టార్ ధనుష్ తో సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో దానిని సెట్స్ పైకి తీసుకొని వెళ్లడం సాధ్యపడలేదు. తెలుగులో రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాలో ధనుష్ నటించాడు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ బాషలలో తెరకెక్కుతోందని టాక్. శేఖర్ కమ్ముల మొదటి సారి తనకి అలవాటైన లవ్ స్టోరీ కథల నుంచి బయటకొచ్చి పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఒక వేళ రష్మిక ఈ సినిమాలో కన్ఫర్మ్ అయితే మాత్రం ధనుష్ కాంబోలో ఆమెకిదే మొదటి చిత్రం అవుతుంది.
అలాగే పాన్ ఇండియా హీరోయిన్ గా తన హవాని కంటిన్యూ చేస్తున్నట్లు అవుతుంది. ఇక సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ధనుష్ ఈ మూవీలో ఒక యువ రాజకీయ నాయకుడుగా కనిపిస్తాడని, అతని పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని టాక్. అయితే ప్రస్తుతం పొలిటికల్ సిచువేషన్స్ కి పీరియాడిక్ టచ్ ఇస్తూ ఈ సినిమా కథని శేఖర్ కమ్ముల సిద్ధం చేశారనే మాట కూడా వినిపిస్తుంది.