టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే అక్కడ అమితాబచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరో వైపు సిద్దార్ధ్ మల్హోత్రాకి జోడీగా మిషన్ మజ్ను అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తవగానే హిందీలో మరో ప్రాజెక్ట్ ని అమ్మడు పట్టేసింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా స్క్రూఢీలా టైటిల్ తో సినిమాని కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాలో రష్మిక మందనని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో అఫీషియల్ గా ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అయితే ఆదిలోనే సినిమాకి అవాంతరం ఎదురైంది. దీనికి కారణం హీరో టైగర్ ష్రాఫ్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం టైగర్ ష్రాఫ్ ఏకంగా 35 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశాడు. అయితే కరణ్ జోహార్ మాత్రం ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిచువేషన్ బట్టి 20 కోట్లకి మించి ఇవ్వలేనని స్పష్టం చేశాడంట. దీంతో టైగర్ ష్రాఫ్ నేను చేయాలేనని సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కరణ్ జోహార్ కూడా అంత రెమ్యునరేషన్ ఇస్తే సినిమాకి బడ్జెట్ పెరిగిపోతుందని నిర్ణయించుకొని మొత్తానికి సినిమా ఆపేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా హీరో రెమ్యునరేషన్ తో కలుపుకుంటే 140 కోట్లు దాటుతుంది. ప్రస్తుత పరిస్థితిలో బాలీవుడ్ హీరోల సినిమాలని ముఖ్యంగా, కరణ్ జోహార్ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలని ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా లేరు. మరో వైపు టైగర్ ష్రాఫ్ కూడా సెలబ్రెటీ వారసత్వంతో వచ్చిన నటుడే కావడం కచ్చితంగా సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందని కరణ్ జోహార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. లైగర్ తో ఇప్పటికే నష్టాల్లో ఉన్నాడు. మళ్ళీ ఈ సినిమాపై అంత బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకుని ఇష్టం లేక సినిమా ఆపేసినట్లు తెలుస్తుంది. దీంతో ప్రారంభం కాకుండానే రష్మిక మూడో అవకాశాన్ని కోల్పోయింది అని తెలుస్తుంది.