సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది. తెలుగు, తమిళ్, హిందీ బాషలలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా తన ఇమేజ్ ని రోజురోజుకి పెంచుకుంటూ పోతుంది. ఈ బ్యూటీ తెలుగులో పుష్ప 2, వారసుడు సినిమాలతో నటిస్తూ ఉండగా హిందీలో ఆమె నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ కూడా సైన్ చేసింది. అలాగే ఆషికి3 కోసం రష్మిక పేరు వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఏ భాషలో సినిమా చేసిన ఆ బాషలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది అనే సంగతి తెలిసిందే.
కన్నడ భామ అయిన కూడా తెలుగులో అరంగేట్రం చేసిన సినిమాలోనే సొంత గొంతు వినిపించింది. తరువాత కూడా అన్ని సినిమాలలో తన సొంత గొంతుకతోనే పాత్రలకి డబ్బింగ్ చెప్పుకొని మెప్పించింది. రష్మికకి ఆమె సినిమాలు ఆమె పాత్రలు ఎంత గుర్తింపు తీసుకొచ్చాయో ఆమె వాయిస్ కూడా అంతే గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపధ్యంలో హిందీలో ఎంట్రీ ఇచ్చిన మూవీస్ లో కూడా తన సొంత గొంతుక తోనే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే హిందీలో డబ్బింగ్ చెప్పడానికి కాస్తా ఇబ్బంది పడిందని ఆ మధ్య ఓ సందర్భంలో చెప్పింది.
అలాగే తమిళంలో కూడా కార్తీతో నటించిన సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే హీరోయిన్ పాత్రలకి డబ్బింగ్ చెప్పడానికి వేరొకరు ఉన్నా కూడా నేను మాత్రం నా గొంతునే వినిపించడానికి ఇష్టపడతాను. మనం చేసిన పాత్రకి మన గొంతు ఉంటేనే దానికి నిండుతనం వస్తుంది. అందుకే ఏ భాషలో సినిమా చేసిన ప్రతి రోజు షూటింగ్ అయ్యాక ఆ బాషని నేర్చుకోవడానికి ఒక గంట సమయం కేటాయిస్తాను. ట్రైనర్ ని పెట్టుకొని బాషపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తాను. అలా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడమే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చింది.