సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఓ వైపు హిందీలో అమితాబచ్చన్ కాంబోలో తాను నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది.
చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ సినిమాపై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లో తనకి గ్రాండ్ వెల్ కమ్ దొరుకుతుందని భావిస్తుంది. మిషన్ మజ్ను కూడా ఈ ఏడాదిలోనే హిందీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
దాంతో పాటు యానిమల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 షూటింగ్ లో అక్టోబర్ నుంచి జరగనున్న నేపధ్యంలో ఆమె కూడా జాయిన్ అవ్వబోతుంది. వారసుడు సాంగ్స్ షూటింగ్ లో కూడా పాల్గొంటుంది.
ఇలా ఫుల్ గా బిజీ షెడ్యూల్ తో రష్మిక ప్రయాణం చేస్తుంది. ఓ వైపు ఇవన్నీ ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంది. అలాగే హాట్ ఫోటో షూట్స్ కూడా షేర్ చేసుకుంటుంది.
తాజాగా ఆమెకి సంబందించిన ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె గోల్డ్ కలర్ బ్లౌజ్ తో ఎద అందాలు బయటకి కనిపించే విధంగా హాట్ లుక్స్ తో రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలపై నెటిజన్స్ కూడా ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.